కేజ్రీవాల్‌కి అహం వచ్చింది: జగ్గారెడ్డి

17
- Advertisement -

ఆప్ నేత కేజ్రీవాల్‌కు అహం వచ్చిందన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ పర్సనాలిటీని డామినేట్ చేసే సత్తా కేజ్రీవాల్‌ది కాదు అన్నారు. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన జగ్గారెడ్డి.. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి లేదు అన్నారు.

ఒంటరిగా వెళ్లి పార్టీని బలోపేతం చేసుకోవాలని రాహుల్ గాంధీ భావించారని అనుకుంటున్నా అన్నారు. కొట్లాడడానికి సిద్ధం కమ్మని ఢిల్లీ ఎన్నికల ద్వారా రాహుల్ గాంధీ క్యాడర్‌కి ఇండికేషన్ ఇచ్చారని భావిస్తున్నా అన్నారు.

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం.. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ గెలిచింది.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి.

Also Read:వీకెండ్ కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం

- Advertisement -