దేశంలో 5 కోట్లు దాటిన కరోనా టెస్టులు..

209
corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 90 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో దేశంలో కేసుల సంఖ్య 43 లక్షలకు చేరువయ్యాయి.

గత 24 గంటల్లో 75,809 పాజిటివ్ కేసులు నమోదుకాగా 1,133 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 42,80,423కు చేరుకోగా 8,83,697 యాక్టివ్ కేసులున్నాయి.

కరోనాతో ఇప్పటివరకు 72,775 మంది మృతిచెందగా 33,23,951 మంది కోలుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ్యాప్తంగా 10,98,621 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా టెస్టుల సంఖ్య 5,06,50,128కు చేరింది.

- Advertisement -