ట్రీ సిటీ ఆఫ్ ది వ‌రల్డ్‌గా హైద‌రాబాద్‌..

52
Tree City

తెలంగాణలో పచ్చదనం ఉట్టిపడేలా.. హరిత తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌ నిత్యం కృషి చేస్తున్నారు. భవిష్యత్‌ తరాలకు స్వచ్చమైన వాతావరణం అందించాలనే తలంపుతో హ‌రిత‌హారం అనే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టి కోట్ల సంఖ్య‌లో మొక్క‌లు నాటి ప‌చ్చ‌ద‌నాన్ని పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు కేసీఆర్‌. విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న హ‌రిత‌హారంతో తెలంగాణ ఆకుప‌చ్చ‌గా మారుతోంది. ఎక్క‌డ చూసినా ప‌చ్చ‌ద‌న‌మే ప‌లుకరిస్తోంది.

హ‌రిత తెలంగాణ కోసం ప్ర‌య‌త్నిస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వానికి మ‌రో అరుదైన గుర్తింపు ల‌భించింది. ఆర్బ‌ర్ డే ఫౌండేష‌న్ అనే సంస్థ‌‌.. 2020 ట్రీ సిటీగా హైద‌రాబాద్‌ను ప్ర‌క‌టించింది. హ‌రిత‌హారం విజ‌య‌వంతం అయింద‌న‌డానికి ఈ గుర్తింపే నిద‌ర్శ‌నం. హ‌రిత‌హారంలో భాగంగా హైద‌రాబాద్‌లో 2020 ఏడాది వ‌ర‌కు 2.4 కోట్ల మొక్క‌లు నాటిన‌ట్లు ఆర్బ‌ర్ డే ఫౌండేష‌న్ త‌న వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. ట్రీ సిటీ ఆఫ్ ది వ‌రల్డ్‌గా హైద‌రాబాద్‌ను ఆర్బ‌ర్ డే ఫౌండేష‌న్ గుర్తించడం చాలా సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఆర్బ‌ర్ డే ఫౌండేష‌న్ ట్రీ సిటీ జాబితాలో ఇండియా నుంచి హైద‌రాబాద్ న‌గ‌రం ఒక్క‌టే ఎంపిక కావ‌డం విశేషం. హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా ప‌చ్చ‌ద‌నాన్ని పెంచేందుకు తాము చేసిన ప్ర‌య‌త్నాల‌కు ఇది గుర్తింపు అని కేటీఆర్ తెలిపారు.