హ్యాపీ బర్త్ డే..రానా

42
rana

సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తు….టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా ఎదుగుతున్న హీరో రానా. తన మొదటి సినిమాతోనే లీడర్ అనిపించుకున్న రానా. ప్రతి ఒక్కరిలో సామాజిక స్పృహ ఉండాలనే అభ్యుదయ దృక్పథంతో తీసిన సినిమానే లీడర్. నాయకుడనే వాడు సామాన్యుడిని చైతన్యపరచాలనే కేరక్టర్ లో రానా ఫస్ట్ మార్కులు కొట్టేశాడు. తర్వాత వచ్చిన కృష్ణం వందే జగద్గురుంతో మాస్‌తో పాటు క్లాస్ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. బాహుబలి చిత్రంతో ఇంటర్నేషనల్ ఫేం తెచ్చుకున్నాడు రానా రానా పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

సౌత్ తో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానా. హీరోగా, ప్రతినాయకుడిగా రానా పోషించిన పాత్రలకు అశేష ఆదరణ దక్కింది.కెరీర్ స్టార్టింగ్ నుంచే బాలీవుడ్ సినిమా మీద దృష్టి పెట్టిన రానా… అమితాబ్ లాంటి టాప్ స్టార్స్ తో కలిసి నటించాడు.

బాహుబలి సినిమా తర్వాత బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు అక్కడి సినీ ప్రముఖులకూ సుపరిచితుడిగా మారిపొయాడు భల్లాలదేవుడు.రానా కేవలం యాక్టర్ మాత్రమే కాదు ..నిర్మాత కూడా. బొమ్మలాట .. ఎ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ పేరుతో ఓ సినిమా తీయగా దానికి అవార్డులు కూడా వచ్చాయి. రానాకు విజన్ ఉంది. అందుకే విజువల్ ఎఫెక్ట్స్ కో ఆర్డినేటర్ గా కూడా చేస్తున్నాడు.

వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న రానా చేతిలో ప్రస్తుతం అరడజన్‌కి పైగా సినిమాలున్నాయి. పవన్‌ కళ్యాణ్‌తో భీమ్లానాయక్ ఇందులో ఒకటి కాగా ఇవాళ రానా బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చారు మేకర్స్‌. రానా ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని greattelangaana.com మనస్పూర్తిగా కోరుకుంటోంది.