- Advertisement -
దేశవ్యాప్తంగా మళ్లీ గ్యాస్ ధరలు భగ్గుమననున్నాయి. హుజురాబాద్ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్యాస్ ధరలు పెంచేందుకు సిద్ధమైంది కేంద్రం. ఇప్పటికే వంటగ్యాస్, పెట్రోల్- డీజీల్, వంట నూనె ధరలు రికార్డు స్ధాయికి చేరగా వినియోగదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మొత్తంగా గ్యాస్‌పై ఇంకొక వారం రోజుల్లో మరో రూ.100 పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
అక్టోబర్ 6న వంటగ్యాస్ సిలిండర్‌కు రూ.15 చొప్పున పెంచాయి. జులై నుంచి అక్టోబరు 6 వరకు దీని ధర రూ.90 వరకూ పెరిగింది. గతేడాది నుంచే ఎల్పీజీపై కేంద్రం రాయితీలు తొలగించగా తాజాగా మరోసారి వంటగ్యాస్ ధరలు భారీగా పెరగనుండటంతో మరిన్ని ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. పెరుగుతున్న వంటగ్యాస్ ధరల అంతరాన్ని భరించేందుకు కూడా కేంద్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.దీంతో మోడీ సర్కార్‌పై తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- Advertisement -