ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పబ్‌లో పట్టుబడిన వారిలో 20 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులకు ఆధారాలు లభించగా వారికి నోటీసులు పంపించే పనిలో ఉన్నారు పోలీసులు. వీరిలో కొంతమంది వీఐపీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
పబ్ మేనేజర్ అనిల్‌తో పాటు అభిషేక్ కనుసన్నల్లోనే డ్రగ్స్ సరఫరా అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. గోవా, ముంబై నుంచి అనిల్ డ్రగ్స్ తెప్పించినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.ఇక డ్రగ్ రాకెట్ తో సంబంధాలు కలిగిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు ఉచ్చు బిగుసుకుంటోంది. డ్రగ్స్‌తో విచ్చలవిడిగా ఎంజాయ్ చేసిన ఐటీ ఉద్యోగులకు నోటీసులు జారీ చేస్తున్నాయి పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు.
ఇప్పటికే చాలావరకు ఐటీ కంపెనీలు 13 మందిపై వేటు వేశాయి. మరికొంతమందిని త్వరలోనే ఉద్యోగాల నుంచి తీసేసి ఇంటికి పంపించే అవకాశం కనిపిస్తోంది. 50 మందికి పైగానే సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కు నోటీసులిచ్చినట్లు తెలిసింది.