మంగళవారం అర్ధరాత్రి తీరం దాటింది ‘మొంథా’ తుఫాను. నరసాపురానికి దగ్గరలో తీరం దాటింది మొంథా. రాత్రి 11.30 నుంచి 12.30 మధ్యలో తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు ప్రకటించింది ఐఎండీ.
ఇంకా తుఫానుగానే కొనసాగుతుంది మొంథా.తీరం దాటే సమయంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదిలింది మొంథా.తుపాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వర్షాలు.. తెలంగాణ పైనా తీవ్ర ప్రభావం ఉంది.
తుఫాన్ ప్రభావం కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అధికంగా కనిపించింది. రాత్రి 8:30 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల నిలిపివేయగా అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లేవారికి మాత్రం మినహాయింపు ఇచ్చాచు.
మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంతో సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా ఖమ్మం, పాలేరు, భద్రాచలం, సత్తుపల్లిలో భారీ వర్షం కురుస్తోంది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
Also Read:IND vs AUS:తొలి T20 టీమిండియా జట్టు ఇదే!

