మొక్కలు నాటిన సిఎఫ్ఓ ఎంజే అక్బర్..

295
Green India Challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ సారధ్యంలో ముందుకు వెళ్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వరంగల్ అండ్‌ కరీంనగర్ రేంజ్ సర్కిల్ ఎంజే అక్బర్ అన్నారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ హనుమంతు విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ జాతీయ రహదారి 369 అనుకోని 1000 మొక్కలు ఫారెస్ట్ సిబ్బద్ధితో కలిసి మొక్కలు నాటారు. ఎంపి సంతోష్ కుమార్ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, కేసీఆర్ చేపట్టిన హరితహారం చాలా అద్భుతమైనది, కేసీఆర్ అడవి సంరక్షణలో చాల కఠినమైన నిర్ణయాలు తీసుకొని అడవులను కాపాడారని తెలిపారు.

85 శాతం మొక్కలు కాపాడే చట్టం తీసుకొచ్చారంటే మొక్కలపైన కేసీఆర్ ఎంతో బాధ్యత అని తెలుస్తుంది. అందుకే ఇప్పుడు మనం 29 శాతం పచ్చదనం కల్గి ఉన్నాం. హరితహారంకి మద్దతుగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొక్కల పెంపకం పైన, పర్యావరణ పరిరక్షణ పైన ప్రజలకు మంచి అవగాహనా కల్పిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ చాలేంజ్‌ను పురుషోత్తం డీఎఫ్ఓ భూపాలపల్లి, డీఎఫ్ఓ రవిప్రసాద్ పెద్దపల్లి, ప్రదీప్ శెట్టి ఐఎఫ్ఎస్ ములుగు జిల్లా డీఎఫ్ఓ లకు ఛాలెంజ్ చేశారు.

- Advertisement -