ఆలుగ‌డ్డ జ్యూస్ తాగితే ఏమౌతుందో తెలుసా?

254
potato juice

సాధారణంగా మ‌నం ఆపిల్ , అర‌టిపండ్లు, ద్రాక్ష ఇలా ప‌లురకాల జ్యూస్ ల‌ను తాగుతాం. ఎండ వేడిమి నుంచి త‌ట్టుకోవ‌డానికి ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతాయి. మాములుగా మ‌నం ఆలుగడ్డ‌ల‌తో ప‌లు ర‌కాల వంట‌లు చేసుకుంటాం. ఆలుగ‌డ్డ క‌ర్రీ, ప్రై, ఆలు ట‌మాటా ఇలా ప‌లు రకాలుగా ఆలును మ‌నం వాడుతాం. ఏవిధంగానైనా ఆలు ను తిన‌డానికి చాలా మంది ఆస‌క్తి చూపుతారు. ఇంత‌వ‌ర‌కూ మ‌నం ఆలు తో త‌యారుచేసిన జ్యూస్ తాగిఉండం. ఆలు జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల మానవురి శ‌రీరానికి చాలా ర‌కాలుగా ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ఓ స‌ర్వేలో వెలువ‌డింది

potato

ముఖ్యంగా ఆలుగ‌డ్డ‌లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో శ‌రీరంలో రక్తం ప్ర‌స‌ర‌ణ స‌రిగా జ‌రుగుతోంది. ఆలుగ‌డ్డ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల క‌ళ్ల కింద వ‌చ్చే న‌ల్ల‌ని మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి. ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఎటువంటి ఇన్ ఫెక్ష‌న్లు రాకుండా ఆలుగ‌డ్డ జ్యూస్ కాపాడుతోంది. మైగ్రేన్‌తో బాధపడే వారు ఆలుగడ్డ జ్యూస్‌ను తాగితే ఫలితం ఉంటుంది. ఈ జ్యూస్ వ‌ల్ల మ‌న‌కు రోజువారిగా కావాల్సిన 40శాతం వ‌ర‌కూ బి విట‌మిన్లు ల‌భిస్తాయి. చ‌ర్మం కూడా ముడ‌త‌లు పొకుండా కాపాడుతోంది.

potato juice

ఇక ఆలు గ‌డ్డ‌ను తింటే ప‌లు నొప్పులు వ‌స్తాయ‌నుకుంటారు కానీ ఆలుగ‌డ్డ జ్యూస్ ను తాగితే చాలా వ‌ర‌కూ బ‌రువు కూడా త‌గ్గుతారని ఓ స‌ర్వేలో తేలింది. ఎటువంటి కిళ్ల నొప్పులు లేకుండా ఉండ‌వ‌చ్చు. ఇక హైబీపీనుంచి కూడా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తోంది. ఆలుగడ్డ జ్యూస్‌లో ఉండే ఫైబర్ మలబద్దకం సమస్య నుంచి ఉపశమనాన్నిస్తుంది.ఆలుగ‌డ్డ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ బారీ నుంచి కూడా ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. ఇలా ఆలుగ‌డ్డ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ప‌లు రోగాల బారీ నుంచి త‌ప్పించుకోవ‌డమే కాకుండా ఆరోగ్యంకూడా కుదురుగా ఉంటుంది.