బొప్పాయి తో ఆరోగ్యం…..

121

సాధారణంగా పండ్లు తినడం వలన గానీ, జ్యూస్ లా తీసుకోవడం వలన గానీ ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అందులో ముఖ్యంగా బొప్పాయి పండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

బొప్పాయి తెల్లని గుజ్జు ముఖానికి రాసుకోవడం వల్ల మంచి కళ వస్తుంది.మొటిమలు కూడా తగ్గుతాయి

బొప్పాయి ఆస్తమా ,కీళ్ళవ్యాధులు వంటివి రాకుండా చేస్తుంది. మలబద్దకానికి బొప్పాయి ఒక మంచి ఔషధంలా పని చేస్తుంది.

Benefits of Papaya

బొప్పాయి పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.

బొప్పాయి లో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.

విటమిన్ “ఎ”, విటమిన్ “బి”, విటమిన్ “సి”, విటమిన్ “డి”లు తగిన మోతాదులో లభిస్తాయని అని వైద్యులు చెప్తున్నారు

కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి.

Benefits of Papaya

బొప్పాయి పండును గుజ్జుగా చేసి శిశువులకు నాలుగో నెలనుంచి తినిపించవచ్చు అని వైద్యులు చెప్తున్నారు.

బొప్పాయి హెమోగ్లోబిన్ పెరగడానికి సహాయపడుతుంది.

బొప్పాయిపండు తినడంవల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి… వంటివి తగ్గుతాయి.