ఇటీవలి కాలంలో జీర్ణ సమస్యలు చాలా సాధారణమయ్యాయి. భోజనం తర్వాత పొట్ట ఉబ్బరం, భారంగా అనిపించడం, మలబద్ధకం లేదా తరచూ అసిడిటీ రావడం వంటి సమస్యలను చాలామంది చిన్న విషయంగా తీసుకుంటున్నారు. కానీ ఆయుర్వేదం ప్రకారం ఇవి శరీరంలో అసమతుల్యతకు ప్రారంభ సంకేతాలు. జీర్ణ సమస్యల మూల కారణం “అగ్ని” (జీర్ణాగ్ని) బలహీనపడటమే . జీర్ణం కాని ఆహారం “ఆమ” (విషతుల్య పదార్థాలు)గా మారి శరీర శక్తిని తగ్గిస్తుందని ఆయన వివరించారు.
ఇందుకోసం గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభించడం జీర్ణవ్యవస్థను మెల్లగా ఉత్తేజితం చేస్తుంది. మెటబాలిజం మందగించినవారు కొద్దిగా నిమ్మరసం కలిపితే ఉపయోగం ఉంటుంది.నిర్దిష్ట సమయాల్లో భోజనం చేయాలి. తాజాగా వండిన వేడి ఆహారం మంచిది. చల్లని, ప్రాసెస్డ్ ఆహారం అగ్నిని బలహీనపరుస్తుంది. నెమ్మదిగా నమిలి తినడం జీర్ణానికి సహాయకరం.
జీలకర్ర, అల్లం, పసుపు సహజ జీర్ణ సహాయకాలు. సోంపు లేదా వాము టీ గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.స్ట్రెస్ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అనులోమ్ విలోమ్ ప్రాణాయామం, భోజనం తర్వాత వజ్రాసనం వంటి సాధనలు ఉపశమనం ఇస్తాయి. తగిన నిద్ర, భోజనం తర్వాత చిన్న నడక జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
Also Read:TG:26 నుంచి అసెంబ్లీ సమావేశాలు

