నగర అభివృద్ధి పనులపై అరవింద్ కుమార్ సమీక్ష..

289
Principal Secretary Municipal Administration Arvind Kumar
- Advertisement -

జిహెచ్ఎంసి, మెట్రో వాటర్ వర్క్స్, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ద్వారా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమీషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో మున్సిపల్ శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ల వెడల్పు, పుట్ పాత్‌ల నిర్మాణం, పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలన్నారు.

Arvind Kumar today held a series of meetings with the GHMC officials

వర్షాకాలం ముగిసిన తరువాతనే బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. పనులు చేపట్టడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. పనులలో నాణ్యత కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నిర్దేశించిన కాలపరిమితిలో పనులు పూర్తి చేయాలని ఆయన తెలిపారు. హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, నిర్ణీత కాలపరిమితిలోగా పనులు పూర్తవుతాయని చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ వివరించారు.

Arvind Kumar today held a series of meetings with the GHMC officials

జిహెచ్ఎంసి ఇంజనీర్లతో సమీక్షిస్తూ పనులు చేపట్టేటప్పుడు మెట్రోవాటర్‌ వర్క్స్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. మంచినీటికి సంబంధించిన పనులు పూరైన తరువాతనే మిగతా పనులు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. వివిధ పనులకు సంబంధించి పనులకు ముందు, పనులు జరుగుతున్నప్పుడు, పనులు పూర్తయిన తరువాత ఎప్పటికప్పుడు ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంపాలని ఆయన సూచించారు. ప్రజల నుండి సోషల్ మీడియా ద్వారా ఏమైనా ఫిర్యాదులు అందితే వెంటనే స్పందించి పూర్తి చేయాలన్నారు.

Arvind Kumar today held a series of meetings with the GHMC officials

మెట్రోవాటర్ వర్క్స్ ఎండి దానకిషోర్ మాట్లాడుతూ.. 300 యం యం పైపులైన్ ట్రెంచెస్ కు సంబంధించి బి.టి, సి.సి రోడ్లపై 683.19 కిలో మీటర్లకు గాను 677.69 కి.మీ ల పునరుద్ధరణ పనులు పూర్తిచేసామని మిగతావి త్వరలో పూర్తి అవుతాయని తెలిపారు. 300 యం యం పైపులైన్ ట్రెంచెస్ కంటే పెద్దవైన పైపులైన్లకు సంబంధించి 160.23 కిలోమీటర్లకు గాను 131.44 కి.మీ పూర్తిచేశామని మిగతాయి త్వరలో పూర్తి అవుతాయని ఆయన వివరించారు.

- Advertisement -