క‌రోనా వైర‌స్…భార‌త్ కు అమెరికా ఆర్ధిక సాయం

205
modi trump
- Advertisement -

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హామ్మారి విజృంబిస్తుంది. రోజు రోజుకి క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇండియాలో 800మందికి పాజిటివ్ రాగా 20మంది మ‌ర‌ణించారు. ఇక కరోనా వైర‌స్ ను త‌రిమికొట్టేందుకు భార‌త్ కు అమెరికా రూ.21కోట్లు ఆర్ధిక సాయాన్ని ప్ర‌క‌టించింది. క‌రోనా వైర‌స్ తో యుద్దానికి 64 దేశాల‌కు అద‌నంగా మ‌రో 174మిలియ‌న్ డాల‌ర్ల నిధుల‌ను అంద‌జేస్తున్న ప్ర‌క‌టించారు.

కరోనా కట్టడికి అగ్రరాజ్యం ఇప్పటికే వంద మిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది. తాజాగా మరింత కేటాయించింది.కరోనాను ఎదుర్కొనేందుకు దేశ వైద్య రంగానికి ప్రధాని మోదీ రూ. 15వేల కోట్ల నిధులు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ మొత్తాన్ని అదనపు ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు, ఐసీయూ బెడ్స్, మెడికల్ బెడ్స్, మెడికల్, పారా మెడికల్ వైద్య సిబ్బంది కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. అమెరికాలో కూడా క‌రోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుంది.

- Advertisement -