చంద్రబాబుకు మధ్యంతర బెయిల్..

32
- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుకు స్వల్ప ఊరట లభించింది. అనారోగ్య కారణాలతో బాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక ప్రధాన బెయిల్ పిటిషన్‌పై నవంబర్ 10న విచారణ చేపట్టనుండగా నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

53 రోజుల రిమాండ్ తర్వాత చంద్రబాబు జైలు నుండి విడుదల కానున్నారు. కండిషన్స్‌తో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా చంద్రబాబు ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు, ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదనే షరతులు విధించింది. .హాస్పిటల్ నుండి ఇంటికి, ఇంటి నుండి హాస్పిటల్‌కు వెళ్లేందుకు మాత్రమే బెయిల్ ఇచ్చారని సీఐడీ తరపు న్యాయవాదులు తెలిపారు.

ఆస్పత్రి మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొన కూడదని, అలాగే ఫోన్‌లో మాట్లాడకూడదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని తెలిపింది న్యాయస్థానం.

Also Read:సంతోష్ శోభన్‌తో అలేఖ్య హారిక

- Advertisement -