50 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ‘ప్రేమ విమానం’

45
- Advertisement -

దేశ వ్యాప్తంగా వైవిధ్య‌మైన కంటెంట్‌తో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను కోరుకునే ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోన్న వ‌న్ అండ్ ఓన్లీ ఓటీటీ జీ 5. తాజాగా అక్టోబ‌ర్ 13 నుంచి ‘పేమ విమానం’ సినిమా జీ 5 లైబ్ర‌రీలో భాగ‌మైంది. భారీ బడ్జెట్స్‌తో వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, జీ 5తో క‌లిసి ఈ వెబ్ ఫిల్మ్‌ను నిర్మించింది. సంతోష్ కాటా ద‌ర్శ‌కుడు. విమానం ఎక్కాలని కలలు కనే ఇద్దరు చిన్న పిల్లలు .. కొత్త జీవితం కోసం విమానం ఎక్కి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకునే ప్రేమ జంట.. వీరితో ముడిపడిన జీవితాల్లో జరిగిన ఘటనలు.. వారి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఈ ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను రూపొందించారు. ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌తో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రించారు. విడుద‌లైన కొన్నిరోజుల్లోనే ఈ వెబ్ ఫిల్మ్ 50 మిలియ‌న్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను రాబ‌ట్టుకోవ‌టం విశేషం. ఈ సంద‌ర్బంగా…

జీ 5 ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీస‌ర్ మ‌నీష్ క‌ల్రా మాట్లాడుతూ ‘‘జీ 5ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తోన్న తీరు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. పులి మేక, వ్య‌వ‌స్థ‌, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి నుంచి రీసెంట్‌గా వచ్చిన ప్రేమ విమానం వ‌ర‌కు తెలుగు ఆడియెన్స్ త‌మ మ‌ద్ద‌తుని తెలియ‌జేస్తూనే ఉన్నాను. ప్రేమ విమానం సినిమా ఇప్ప‌టికే 50 మిలియ‌న్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను రాబ‌ట్టుకోవ‌టం ఆనందంగా ఉంది. మంచి క‌థ‌, దానికి త‌గ్గ‌ట్టు న‌టీన‌టుల పెర్ఫామెన్స్‌లు ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకున్నాయి. ప్రేమ విమానం ఓ ఇన్‌స్పైరింగ్ స్టోరి. క‌లల‌ను నేర‌వేర్చుకోవాల‌నుకునే పిల్లలు, ప్రేమించి ఒక్క‌టవ్వాల‌నే యువ జంట‌.. ఇవ‌న్నీ ఎంతో ఆస‌క్తిక‌రంగా మెప్పించాయి. దీన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించినందుకు ఎంతో గ‌ర్వంగా ఉంది’’ అన్నారు.

Also Read:పరిమితుల మధ్య శ్రీను వైట్ల!

- Advertisement -