తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న నటుడు చిరంజీవి. గాఢ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు అంచెలంచెలుగా మెగాస్టార్‌గా ఎదిగారు. డ్యాన్స్,ఫైట్,తనదైన డైలాగ్ డెలివరీతో మాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సైరా సినిమాలో నటిస్తోండగా ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇక చిరంజీవి కెరీర్‌లో చెప్పుకొదగ్గ సినిమాల్లో ఒకటి పున్నమినాగు. చిత్రంలో నర్సింహరాజుతో స్క్రీన్ షేర్ చేసుకున్నా -విలనిజం షేడ్స్‌తో చేసిన హీరో పాత్ర చిరంజీవిదే. హీరోగా ఎదుగుతున్న తొలినాళ్లలో చిరంజీవి నటన ఎంత స్వాభావికంగా ఉండేదో ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది.
పాము కళ్లలో కోపం, పొరవదలడం లాంటి నాగుపాము లక్షణాలను ప్రదర్శించే సన్నివేశాల్లో చిరంజీవి నటన అద్భుతం. అంతేకాదు, తన పరిస్థితిపై తనే కోపాన్ని ప్రదర్శించి, తనను తనే అసహించుకునే సందర్భంలో కోపం, వేదన, అత్యన్యూనతలాంటి స్వభావాలను అత్యద్భుతంగా ప్రదర్శించాడు చిరంజీవి.
ఏవీఎం నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజశేఖర్ దర్శకత్వం వహించారు. సినిమాలోని పున్నమిరాత్రీ పువ్వులరాత్రీ అన్న పాట ఆల్‌టైం సూపర్ హిట్ సాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది. 10 కేంద్రాల్లో 50 రోజలు ఆడిన ఈ చిత్రం వైజాగ్,విజయవాడల్లో సెంచరీ కొట్టింది. ఇక ఈ సినిమా విడుదలై 39 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో మెగా ఫ్యాన్స్ పున్నమినాగు మూవీ డీటైల్స్‌ని పోస్ట్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.